విజయవాడలో శనివారం డీజీపీ మీడియా సమావేశం

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగినట్లు ప్రచారం చేయొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  విజయవాడలో శనివారం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, ఏపీ పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు.

ఆమె చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే..

అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన సంఘటనపై డీజీపీ స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలతో పాటు, ఆయన చూపించిన వీడియోపై డీజీపీ వివరణ ఇచ్చారు. మహిళా అభ్యర్థి చుట్టు ఉన్నది టీడీపీ నేతలే అని, నామినేషన్‌ ఎవరో దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. 

ఎన్నికల నిర్వహణకు మానిటరింగ్‌ సెల్‌ 

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా 35 సంఘటనలు జరిగాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా 43 ఫిర్యాదులు

About The Author