కరోనా దెబ్బకి రూ.లక్ష కోట్లకు నష్టపోయిన ముకేశ్ అంబానీ …


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కబళిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 5వేల మందిపైగా ప్రాణాలు విడిచారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కబళిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 5వేల మందిపైగా ప్రాణాలు విడిచారు. కరోనా ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు పతనం అయ్యాయి. ఫిబ్రవరి 19 నుంచి ఇన్వెస్టర్లు 32 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూడా మినహాయింపేమీ కాదు. ఈ ఏడాది ఇప్పటి అంబానీ ఆస్తి 30 శాతం హరించుకుపోయింది. 18.6 బిలియన్ డాలర్ల అంటే 1.38 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. నెట్‌వర్త్ 40 బిలయన్ డాలర్లుగా అయితే గురువారం మార్కెట్లు భారీగా పతనం అవ్వడంతో ఒక్కరోజులోనే రూ.24,000 కోట్లు తగ్గింది. Also Read – మొబైల్ ఫోన్ వినియోగదారులకు జీఎస్‌టీ షాక్.. అంబానీ మాత్రమే కాకుండా దేశంలోని సంపన్నుల జాబితాలో రెండో వారిగా కొనసాగుతున్న జీమ్ ప్రేమ్‌జీ కూడా నష్టాలు తక్కువేం కాదు. రూ.23,000 కోట్లు సంపాదన తగ్గింది. మరో పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 40 శాతం అంటే 30,000 కోట్ల రూపాయలు హరించుకుపోయింది. శివ్ నాడార్ సంపద విలువ 2.27 బిలియన్ డాలర్లు, దిలీప్ సంఘ్వీ సంపద విలువ 1.57 బిలియన్ డాలర్లు, ఉదయ్ కోటక్ సంపద విలువ 2.41 బిలియన్ డాలర్లు ఆవిరైంది. అయితే సూపర్‌మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ సంపద విలువ పెరిగింది. రాధాకిషన్ దమానీ సంపద విలువ 3,100 కోట్ల రూపాయలపైకి కదిలింది

About The Author