ప్రతి వందేళ్లకు ఒకసారి మహమ్మారి…యాదృచ్చికమా లేక…!!?
ఇది యాదృచ్చికమో లేదంటే విధి ఆడుతున్న వింత నాటకమో తెలియదుగాని, ప్రతి వందేళ్లకు ఒకసారి ప్రపంచాన్ని మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. 2020 లో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 5000 మంది వరకు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా రెండు లక్షల మంది వరకు వైరస్ బారిన పడ్డారు. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి ఇప్పటిది కాదు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి మహమ్మారిలను ఎన్నో వచ్చాయి. అయితే, ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రతి వందేళ్లకు ఒకసారి మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్నది. 1720 వ సంవత్సరంలో మార్సెల్లీ ప్లేగ్ వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వ్యాధి కారణంగా లక్షమందికి పైగా ప్రజలు మరణించారు. ఇది యూరప్ దేశాల్లో సంభవించిన మహమ్మారి. దీని తరువాత 1820 వ సంవత్సరంలో కలరా సోకింది. ఆసియా దేశాల్లో ఈ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ వైరస్ వలన లక్షమంది మరణించారు. ఇకపోతే, 1920 వ సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని గజగజలాడించింది. ఈ ఫ్లూ వలన 50 లక్షల మంది వరకు మరణించారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఈ వైరస్ వలన ఇప్పటి వరకు ఐదువేల మంది మరణించారు. చైనాలో మొదలైన ఈ వైరస్ క్రమంగా 145 దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు యూరప్ దేశాల్లో వైరస్ విలయతాండవం చేస్తున్నది. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రతి వందేళ్లకు ఒకసారి మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. 1720,1820,1920 ఇప్పుడు 2020 లో మహమ్మారి వ్యాపించింది.