బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో .. తల్లి వచ్చిందన్న భయంతో..


బాయ్‌ఫ్రెండ్‌తో ఇంట్లో ఉండగా తల్లి వచ్చిందన్న భయంతో మొదటి అంతస్థు నుంచి దూకిన బాలికకు ప్రాణాపాయం తప్పింది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక(17) ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంది. ఈ క్రమంలో వారిద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉండగా అకస్మాత్తుగా తల్లి రావడాన్ని బాలిక గమనించింది. దీంతో దొరికిపోతామేమో అనే భయంతో మొదటి అంతస్థులో ఉన్న ఇంటి బెడ్‌రూమ్‌ కిటికీలోంచి బయటకు దూకింది. ఈ క్రమంలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం యువకుడు(20) అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. బాలికలపై లైంగిక వేధింపుల చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

About The Author