ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులో కరోనా… ఏకంగా బస్సునే ఆస్పత్రికి తరలింపు!


ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులో కరోనా… ఏకంగా బస్సునే ఆస్పత్రికి తరలింపు! ఎక్కడంటే…..! తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం చాలా తీవ్ర రూపం దాల్చుతుంది . ఇప్పటికే తెలంగాణలో 16 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో మూడు కేసులు నమోదయ్యాయి . అనుమానితుల సంఖ్య అయితే రోజురోజుకి మితిమీరిపోతుంది . దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింతగా అప్రమత్తం అయింది . మొన్నటి వరకు ఎన్నికల హడావుడి లో కరోనా విషయాన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైనా కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు వెంటనే చర్యలు చేపడుతున్నారు . ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు అడుగులు వేస్తున్నారు . ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగిన ఒక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది . కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణీకులు ఉన్న ఒక బస్సును ఏకంగా ఆస్పత్రికి తరలించారు . కర్నూలు జిల్లా వెల్దుర్తి మీదుగా ధర్మారం వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు లో కొందరికి కరోనా లక్షణాలు ఉన్నాయని పలువురు అనుమానించారు . దీంతో వెల్దుర్తి వెళ్తున్న బస్సును ఆపివేసి ప్రయాణికులు ఆటోలో బస్సు తో 13 మందిని సహా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . అనుమానితులైన 11 మంది తో సహా అందులో ప్రయాణించిన అందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు . వైరస్ లక్షణాలు కనిపించడంతో ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్ సహా ఆసుపత్రికి అందరూ వెళ్లారు అని తెలుస్తోంది . అయితే కరోనా ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక స్పష్టతను ఇచ్చింది . కరోనా వైరస్ బారిన పడిన ప్రకాశం , నెల్లూరుకు చెందిన వ్యక్తులు కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు . కరోనాపై ఎలాంటి మరణం లేదని స్పష్టం చేశారు . ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు . జనతా కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని కోరారు .

About The Author