ఉరికి ముందు ఒక మంచిపని చేసిన ముఖేశ్..
నిర్భయ దోషులను ఈ రోజు ఉరితీయడం తెలిసిందే. వారు చివరి కోరికలేమీ కోరలేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఇద్దరు దోషులు తాము చనిపోయాక చేయాల్సి పనుల గురించి జైలు సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టరు నెహాల్ బన్సాల్ ఉరికి గంట ముందుకు జైలుకి వెళ్లి దోషుల చివరి కోరికల గురించి తెలుసుకున్నారు. తన అవయవాలను దానం చేయాలని ముఖేశ్ సింగ్ కోరాడు. అవయవదాన పత్రంపై అతడు సంతకాలు చేశాడని అధికారులు వెల్లడించారు. దీంతో అతని అవయవాలను దానం చేయనున్నారు. అయితే ఉరితీసిన తర్వాత అరగంటపాటు కొయ్యకు వేలాడదీయడంతో కీలక అవయవాలు దానానికి పనికిరావని అంటున్నారు. ముఖేశ్ ఉరికి ముందు పశ్చాత్తాపపడ్డాడని, తనను ఉరితీయొద్దని అధికారులను బతిమాలాడని తెలుస్తోంది.
మరో దోషి వినయ్ శర్మ కూడా తన చివరి కోరిక చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు తాను వేసిన పెయింటింగులను
సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని కోరాడు. తాను చదివిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, తన ఫొటోగ్రాఫ్‌ను కుటుంబానికి అందించాలి కోరాడు. మిగతా ఇద్దరు పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ మాత్రం ఎలాంట కోరికా కోరలేదు.