ఈనెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు…


ఆదివారం చేసినట్లే ప్రజలందరూ ఈనెల 31వ తేదీ వరకు ఇల్లు దాటి ముందుకు రావొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎవరైనా అయిదుగరు మించి గుమిగూడరాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే కాయగూరలు, పాలు వంటి నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఇంటికి ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారని ఆయన చెప్పారు. నిరుపేదలకు ఒక నెల రేషన్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయంచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.87.95 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని.. అన్ని కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.
అలాగే రూ. 1500 ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈనెలాఖరు వరకు అన్ని రాష్ట్ర సరిహద్దులు బంద్‌ చేస్తున్నామని అన్నారు. నిత్యావసర వస్తువులు తెచ్చే వాహనాలు మినహా ఎలాంటి ప్రైవేట్, పబ్లిక్‌ వాహనాను రాష్ట్రంలోని అనుమతించమని అన్నారు. కార్లు, ఆటోలను కూడా ఆపేస్తామని అన్నారు

About The Author