క‌రీంన‌గ‌ర్ అష్టదిగ్భందనం – ఇంటింటికి వెజిటబుల్స్ సరఫరా..


కరీంనగర్ – జిల్లాలో కరోనా కేసులు బయట పడటంతో జిల్లా యంత్రాంగం పకడ్భంధిగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నది. కరీంనగర్ మొత్తం అష్టదిగ్భందనం చేశారు..ఎక్కడి వాళ్లక్కడే..దుకాణాలు బంద్..రోడ్లన్నీ నిర్మానుష్యం..జిల్లాకు వచ్చే సరిహద్దు మూసివేశారు..జిల్లా అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. సరిహధ్దులను మూసివేసిన అధికారులు పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించారు ఇప్పటి వరకూ .80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్ రాగా ఇతరుల వారికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. కాగా, ఇటీవలే ఇండోనేషియా బృందం కరీంనగర్ కు వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి కరోనా పాజిటివ్ ఉందని తేలడంతో అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి కూడా వైరస్ లక్షణాలు ఉండడంతో తీవ్ర భయాందోనళలు నెలకొన్నాయి. అందులో భాగంగా వీరు తిరిగిన ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. ముకరంపురాలో మరింత నిబంధనలు పెంచారు. బారికేడ్లను ఏర్పాటు చేసి లోపలి వారు బయటకు..బయట వారు లోనికి వెళ్లకుండా..చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచిస్తున్నారు పోలీసులు. బయటకు వచ్చిన వాహనాను సీజ్ చేస్తున్నారు. ఇక నిత్యావసరాలు ఇంటింటికి అందించే పనిలో పడ్డారు..దీనిలో భాగంగా ముకురంపుర ప్రాంతం లో ఇండ్లకు కూరగాయలను జిల్లా కలెక్టర్ కె.శశాంక , సి.పి. కమలాసన్ రెడ్డి , అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, కార్పొరేషన్ కమిషనర్ క్రాంతి, మేయర్ సునీల్ రావు లు దగ్గరుండి పంపిణీ చేయిస్తున్నారు.. ఏ ఒక్కరూ బయటకు రావద్దని, అన్ని ఇంటి వద్దే సమకూరుస్తామని స్థానికులకు అధికారులు హామీ ఇస్తున్నారు.

About The Author