కరోనా వాక్సిన్ వచ్చేస్తోంది!
ఒక సింగిల్ డోస్ యాంటీ పారాసైటిక డ్రగ్ ఇస్తే కరోనా వైరస్‌ను మానవ శరీరంలో 48 గంటల్లోనే పూర్తిగా నశించిపోతోందని పరిశోధనల్లో వెల్లడైంది. కేవలం 24 గంటల్లోనే ఈ యాంటీ పారాసైటిక డ్రగ్ డోస్ వల్ల కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గిపోతోందని కూడా శాస్త్రజ్ఞులు గమనించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్ అందరికీ అందుబాటులోనే ఉంది. అయితే, ఎంత శాతంతో దీని డోస్ కచ్చితంగా ఇవ్వాలనే అంశంపై మాత్రం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో మాత్రం ఈ డ్రగ్‌తో కరోనాను సంపూర్ణంగా కట్టడి చేయవచ్చునని స్పష్టమైందని ఆస్ట్రేలియాలోని మొనాష్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న మొనాష్ బయోమెడిసిన్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఒక సింగిల్ డోస్‌తోనే కరోనా ఆర్‌ఎన్‌ఎ మొత్తం తొలగిపోతుందని సంస్థకు చెందిన డాక్టర్ కైలీ వాగ్‌స్టాఫ్ వెల్లడించారు. యాంటీ పారాసైటిక డ్రగ్ ఐవర్‌మెక్టిన్ వల్ల కరోనా వ్యాప్తి పూర్తిగా ఆగిపోతోందని తెలిపారు. అయితే, ఇది ఏవిధంగా కట్టడి చేసి నశింపచేస్తోందో ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఇప్పుడు శాస్త్రజ్ఞుల ముందు ఉన్న అంశం ఏ వెూతాదులో ఈ డ్రగ్ డోస్ మానవులకు ఇస్తే ఎటువంటి ప్రమాదం ఉండదో కనిపెట్టడమేనని చెప్పారు