ఢిల్లీ నుండి వచ్చిన వారి అందరి లెక్కలు తెలాలి!!


రైల్వే శాఖ ఇచ్చిన లెక్క ప్రకారం మార్చి 11-23 మధ్య 2.20 లక్షల మంది ఢిల్లీ నుండి తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. అంటే విమానాల ద్వారా వచ్చిన వారు, బస్ ద్వారా, సొంత వాహనాల ద్వారా వచ్చిన వారి లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. *మరి వారందరు మార్కజ్ నుండే వచ్చారా ?* వైరస్ బయటి దేశాల నుండి ముందు ఢిల్లీ నగరానికి తాకింది అక్కడి నుండి మార్కజ్ వెళ్లిన వారికి తాకింది అనేది గమనార్హం. (అంటే ఆ గ్యాప్ లో ఇంకా ఎంతమందికి తాకిందో అని ఆలోచన అటు ప్రభుత్వాలు ఇటు మీడియా చేయట్లేదు.)
అంటే వారందరితో పాటు వారి కుంటుంబీకుల్ని కలుపుకొని మొత్తానికి కోటిన్నర మందికి టెస్ట్స్ చేయాలి. దేశం మొత్తం మీద 15కోట్ల పైన ఇప్పటికే టెస్ట్ చేసి ఉండాల్సింది కానీ అనుకున్నంత యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడంలేదు. కానీ ప్రభుత్వలు చేసిన టెస్ట్ లు నేటికి ఒక లక్ష కూడా దాటి ఉండవు. రోజుకు కనీసం 80 వేల మందికి టెస్ట్ చేయాల్సి ఉంది. ప్రభుత్వాలు lock down సమయంలోనే covid19 టెస్టులు విజయవంతంగా చేస్తేనే ఫలితం ఉంటుంది. లేదంటే మళ్ళీ lockdown పొడిగించాల్సి వస్తుంది. కానీ టెస్ట్ లు 10వేల మందికి దాటడం లేదు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కులం మతం అని మాట్లాడే మలం గాళ్ల గురించి మాట్లాడడం కూడా వ్యర్థమే.
ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి అత్యవసర పరికరాలు ఇవ్వలేకున్న దేశం నుండి వైరస్ ను తరిమేయడానికి తమవంతుగా కష్టపడుతున్న భారత డాక్టర్ లకు నా సలాం.

About The Author