గన్నీ బ్యాగుల కోసం ప్రధానికి సీఎం శ్రీ కేసీఆర్ ఫోన్…
రాష్ట్రంలో గన్నీ బ్యాగులకు తీవ్ర కొరత ఉన్నది. గన్నీ బ్యాగులు తయారుచేసే పరిశ్రమలు పశ్చిమబెంగాల్‌లో ఉన్నాయి. ప్రతి ఏటా అక్కడి నుంచే బ్యాగులు వస్తాయి. ఈసారి లాక్‌డౌన్ కారణంగా బెంగాల్లో పరిశ్రమలు మూతపడటంతో గన్నీ బ్యాగులకు కొరత ఏర్పడింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమలను తెరిపించాలని, గన్నీ బ్యాగులు రాష్ర్టాలకు చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. రాష్ర్టానికి గన్నీ బ్యాగులు చేరుకునే విషయంలో సంబంధిత శాఖలతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాలసంస్థ కమిషనర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.