ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్.? కేంద్రం నిర్ణయం


రైల్వే’కి సంకేతాలు ఇబ్బంది లేకుండా చర్యలు..
ప్రభావిత ప్రాంతాలపై ‘దృష్టి..
కరోనా కట్టడికి మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌ డౌన్‌ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని కేంద్రప్రభుత్వం బుధవారం తెల్లవారుజామున కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పలు రాష్ట్రాలు చేసిన వినతులపై కేంద్రం సానుకూలంగానే స్పందించింది. మంగళవారం రాత్రి వరకు కేంద్రం రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో అంచెలంచెలుగా చర్రలు జరిపింది. ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
::—ఇవిగో సంకేతాలు::—-
తాజాగా భారతీయ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన ఐ.ఆర్‌.సీ.టీ.సీ తీసుకున్న నిర్ణయంతో లాక్‌ డౌన్ పొడిగింపుపై పరోక్ష సంకేతాన్ని కేంద్రం ఇచ్చింది. రైల్వే టికెట్లను ఆన్‌ లైన్‌ లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
::—-అందుకే ‘రిజర్వేషన్లు’ ఆపింది::—-
ఈ నెలాఖరు వరకూ లాక్‌ డౌన్‌ ను పొడిగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన తెరపైకొచ్చింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్‌ డౌన్ పొడిగింపే మేలనే భావనకు రావడంతో కేంద్రం ఆ దిశగానే అడుగులేస్తుంది.
:::——తెగేసి చెప్పిన రాష్ట్రాలు:::——
కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌ డౌన్ కొనసాగించాలంటూ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఆర్ధిక వ్యవస్థను నెమ్మదిగానైనా చక్కదిద్దుకోవచ్చని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవడమే ప్రస్తుతం ముఖ్యమని తెలంగాణ సీఎం కేసీఆర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు.
:::——దశలవారీగా:::——
లాక్‌ డౌన్ దశలవారీగా ఎత్తెయ్యాలని, ఒక్కసారిగా ఎత్తేయడం సరికాదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. లాక్‌ డౌన్ మరో రెండు వారాలు కొనసాగించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగించాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె డిమాండ్ చేశారు.
:::——ఇబ్బంది లేకుండా చర్యలు:::——-
నిత్యావసర సరుకుల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపింది. రాష్ట్రాలు కూడా సానుకూలంగా స్పందించాయి.
:::——ప్రభావిత ప్రాంతాలపై దృష్టి:::—/
ప్రభుత్వ శాఖలన్నీ కరోనా ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యక్ష దృష్టి సారించాయి. వ్యాధి ప్రబలనున్న ప్రాంతాలను లాక్ డైన్ తో పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని కేంద్రం సూచించింది. ఆమేరకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం చేసే విధంగా కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. 30వరకు తెలంగాణ కోర్టులు కూడా::—-
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఈనెల 30 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫుల్‌ కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న మరోసారి పుల్‌ కోర్ట్‌ సమావేశమై లాక్‌ డౌన్‌ పై చర్చించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది.

About The Author