కోవిడ్19 ఆసుపత్రిలో 7రోజులు విధులు నిర్వహించిన డాక్టర్లు 14 రోజుల క్వారేంటైన్ తప్పనిసరి.

కోవిడ్ విధుల్లో ఉన్న సిబ్బందికి అందరికి ప్రత్యేక పి.పి.ఇ. లు, మాస్కులు

ఐఎం ఏ, ప్రవేట్ డాక్టర్లు విధులు నిర్వహణకు సిద్ధంగా ఉండాలి.

జిల్లా కలెక్టర్

తిరుపతి, ఏప్రిల్ 09: కోవిడ్ ఆసుపత్రిలో వైద్య సేవలు 7 రోజులు అందించిన డాక్టర్లు ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు తప్పనిసరి ప్రత్యేక క్వారేంటైన్ తీసుకోవాలని, వైద్యసేవల్లో అవసరమైన అన్నిరకాల కిట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త తెలిపారు. గురువారం ఉదయం స్థానిక రుయా ఆసుపత్రిలో వైద్యులతో సమావేశమై పలుసూచనలు చేశారు. కలెక్టర్ వివరిస్తూ డాక్టర్ల కు అన్ని విధాలా సౌకర్యాలకు సిద్ధంగా ఉన్నామని, వారి కుటుంబసంక్షేమ ప్రధానమని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో 7 రోజులు కోవిడ్ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన వారికి 14 రోజులు ప్రత్యేక క్వారేంటైన్ నిర్వహించాలని సూచిందని , హోమ్ క్యారేంటైన్ కు అనుమతి లేదని అన్నారు. మీకు కావలసిన గెస్ట్ హౌస్, లాడ్జి లలో అన్ని సౌకర్యాలు కల్పింస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రం ఆసుపత్రిలో పాజిటివ్ కేసులను ఉంచామని, వీలైనంత ప్రయణదూరం తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఎక్కడ క్రిటికల్ కేసులు లేవని అన్నారు. డాక్టర్లు పూర్తి సెక్యూరిటీ తో వెళ్లి వైద్యసేవలు అందించాలని తెలిపారు. ఇబ్బందులు ఉంటే కలెక్టర్ దృష్టికి గానీ రుయా సూపర్నెంట్ దృష్టి కి గానీ తీసుకుని వచ్చి సమస్య పరిష్కరించుకునే విధంగా ఉండాలని అన్నారు. రుయాలో మెడిసిన్ వార్డు ఏర్పాటు రెండురోజుల్లో పూర్తి చేసి అందుబాటులో కి తీసుకు రావాలని అన్నారు. ప్రభుత్వ నుండి ఐ ఎం ఏ , ప్రవేట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది జాబితా అందిందని, వారికి వేతనాలు ప్రభుత్వమే నిర్దేశించి అందించనున్నారు. ఏ క్షణం అయినా ఉత్తర్వులు రాగానే విధుల్లోకి రావలసి ఉంటుందని ఇప్పటికే మీకు సూచనలు అంది ఉంటాయని అన్నారు. ఒపి లో విధులు నిర్వహిస్తున్న వారు కూడా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని అనుమానం వస్తే వెంటనే క్యారేంటైన్ కు పంపాలని సూచించారు. అవసరాన్ని బట్టి నెగటివ్ కేసుల క్వారేంటైన్ కు ఇ. ఎస్. ఐ., అమర ఆసుపత్రి ఉపయోగించే విధంగా ఉండాలని అన్నారు. జిల్లాకు అందిన వివిద రకాల పిపిఇ లు, మాస్కులు డాక్టర్లు పరిశీలించారు. అత్యున్నత ప్రమాణాలు కలిగివున్నాయని విషుల్లో ఉన్న డాక్టర్లు సంతృప్తి వ్యక్తం చేసారు. రుయా సూపర్నెంట్ రమణయ్య మొదటి పాజిటివ్ కేసు వ్యక్తిని డిస్జార్ చేస్తున్నామని మరికొన్ని రోజులు పాటించాల్సిన నియమాలను వివరించామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇది మీ విజయం అని ఇదే స్ఫూర్తితో సేవాలందించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రసూతి ఆసుపత్రికి కూడా అవసరమైన హెల్త్ సేఫ్టీ మెటీరియల్ అందించాలని సూచించారు.

*వికృత మాల హౌసింగ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్*

భవిష్యత్ అవసరాల దృష్ట్యా క్వారేంటైన్ కు అవసరం ఉండవచ్చుఁ, 1580 గృహాలో అన్నివసతులు కలిగి ఉండేలా సిద్ధంగా ఉంచాలని జెసి2 చంద్రమౌళి, తిరుపతి ఆర్డిఓ కనక నరసా రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. విద్యుత్, మంచి నీరు అందుబాటులో వున్నాయని మరోసారి శానిటేషన్ చేసి ఉంచుకోవాలని సూచించారు.

కలెక్టర్ పర్యటనలో డిఎం హెచ్ ఓ పెంచలయ్య, డిసిహెచ్ ఎస్ సరలమ్మ, పిడి , డి. ఆర్.డి.ఎ. మురళి, రుయా డాక్టర్లు సుధాకర్ రావు, హరికృష్ణ, నాగేశ్వరరావు, ప్రకాష్, ఫహిం, ఐ.ఎం.ఎ. డాక్టర్లు రవిరాజు, బలరామ రాజు, యుగంధర్, శ్రీహరి రావు తదితరులు పాల్గొన్నారు.

.డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి.

About The Author