ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం…
ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా రామసుందర రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తుడా సెక్రటరీగా పని చేస్తున్నారు. తక్షణం ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది
ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా రామసుందర రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తుడా సెక్రటరీగా పని చేస్తున్నారు. తక్షణం ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని తొలగించిన కొద్ది క్షణాల్లో ఈయన్ని నియమిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్.
కాగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ కాసేపటి క్రితం జీవో జారీ చేసింది. ఆర్డినెన్స్ సవరణ ద్వారా రమేష్ కుమార్‌కు ఉద్వాసన పలికింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సర్కార్.. దాన్ని గవర్నర్‌కు పంపగా.. వెంటనే ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం.. వెంటనే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధుల నుంచి రమేశ్ కుమార్‌ను తప్పించింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రమేష్ కుమార్‌కు, సీఎం జగన్‌కు మధ్య తీవ్రమైన విభేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా మార్చి నెలలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు నోటిఫికేషన్ రాగా.. కోవిడ్-19 వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థలను వాయిదా
వేశారని జగన్ స్వయంగా రమేష్ కుమార్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.