టాస్క్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్ బిట్టూ మృతి…
టాస్క్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్ బిట్టూ మృతి.
టాస్క్ ఫోర్స్ విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన బిట్టూ
టాస్క్ ఫోర్స్ విధులలో విశేష ప్రతిభ కనబరిచిన డాగ్ స్క్వాడ్ బిట్టూ శనివారం రాత్రి మరణించింది. ఎర్ర చందనం స్మగ్లర్లు దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలను కనుగొనడం లో బిట్టూ దిట్టగా పేరుపొందింది. కొన్ని సందర్భాలలో దాగి ఉన్న స్మగ్లర్లు ను కూడా చూపించి, టాస్క్ ఫోర్స్ ప్రతిష్ఠ ను ఇనుమడించేలా చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అధీనంలో ఉంటూ, టాస్క్ ఫోర్స్ కు సేవలు అందజేసిందని టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ పి రవిశంకర్ తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ బిట్టూ ఒక రకమైన కాన్సర్ వ్యాధితో మరణించదని తెలిపారు. ఆదివారం దానికి పోస్టుమార్టం నిర్వహించి, ఘనంగా అంత్యక్రియలు చేసినట్లు తెలిపారు. స్వంత ఖర్చులతో బిట్టూని ఐస్ బాక్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు. టాస్క్ ఫోర్స్ కు మూడు డాగ్ స్క్వాడ్ లను కేటాయించగా బిట్టూ 2017 ఫిబ్రవరి 21 నుంచి తన సేవలను అందజేస్తొందని అన్నారు. అది 2016 జనవరి 13వ తేదీన జన్మించిందని చెప్పారు. ఎర్ర చందనం దుంగలను కనుగొనే ప్రత్యేకతతో మొయినా బాద్ లో శిక్షణ పొందినట్లు తెలిపారు. 8 నెలలు శిక్షణ పూర్తిచేసుకుని, టాస్క్ ఫోర్స్ కార్యాలయం క