రేపు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన…


కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాయి.
కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మంగళవారం అర్ధరాత్రితో ముగుస్తుంది. మరి ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? లేదంటే కరోనా తీవ్రతను బట్టి ప్రాంతాల వారీగా సడలిస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రసంగించనున్న ప్రధాని.. లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేయనున్నారు. రేపే లాక్‌డౌన్ చివరి రోజు కావడంతో మోదీ ఏం మాట్లాడతారని.. ఎలాంటి ప్రకటన చేస్తారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. అటు మిగతా రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్‌ను పెంచాలని మోదీకి సూచించాయి. ఐతే ఇటీవల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రజల ప్రాణాలతో పాటు ప్రపంచమూ ముఖ్యమనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి పలు రంగాలకు మినహాయింపు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కరోనా తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా విభజిస్తారని.. దానికి అనుగుణంగా సడింపు ఉంటుందని సమాచారం. రెడ్ జోన్లలో మాత్రం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తారని తెలుస్తోంది. మరి ప్రధాని మోదీ రేపు ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.

About The Author