షాకింగ్ న్యూస్ : ఏపీలో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా….


కరోనా ఎలా వస్తుందో ? ఎలా వ్యాప్తిస్తుందో అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ సోకుతుందని తొలుత భావించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడకు వెళ్లకుండానే..కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో వైద్యులు తలల పట్టుకుంటున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ పకడ్బందిగా అమలు చేస్తున్నారు. అయినా..ఏ మాత్రం కేసుల సంఖ్య తక్కువ కావడం లేదు. కరోనా వైరస్ పై షాకింగ్ న్యూస్ వస్తున్నాయి. ఏపీలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. కానీ ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. కరన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాపిస్తోందని గుర్తించారు. తూర్పుగోదావరి, గుంటూరు తదితర జిల్లాల్లో పలు ఉదంతాలు వెలుగు చూశాయి. ఏపీలో తొలుత తక్కువగానే కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కానీ ఢిల్లీ నిజాముద్దీన ఘటన అనంతరం ఒక్కసారిగా పాజిటివ్ కేసులు ఎక్కువయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించిందని గుర్తించారు. గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో నమోదైన కేసులు ఈ విధంగా వచ్చాయని తేల్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచిస్తోంది. ప్రజలు సాధ్యమైనంత వరకు డిజిటల్ చెల్లింపులు చేయాలని సూచిస్తున్నారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఒక్కరోజే 44 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 483కు పెరిగాయి. వీటిల్లో ఎక్కువగా… ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 16 మంది డిశ్చార్జ్ కాగా… 9మంది మరణించారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 458గా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు.

About The Author