పేదల పెద్ద కొడుకు.. మా కేసీఆర్‌ సార్‌కు దండాలయ్యా…


కేసీఆర్‌ ను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు.. ఆయన పేరు వింటేనే బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం వస్తుంది. విపత్కర పరిస్థితుల్లో ఆపద్భాందవుడిలా అన్ని వర్గాలను ఆదుకుంటారయన.. కేసీఆర్‌ శక్తి మేరకు అట్టడుగు వర్గాలకు సాయం చేస్తుంటారు. కరోనా వైరస్‌ ప్రబలడం.. లాక్‌డౌన్‌ విధించడంతో.. నిరుపేదల పాలిట కేసీఆర్‌ దేవుడయ్యారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి రేషన్‌ కార్డుదారుడికి రూ. 1500 చొప్పున కేసీఆర్‌ సర్కార్‌ జమ చేసింది.

కేసీఆర్‌ ప్రభుత్వం జమ చేసిన రూ. 1500లను విత్‌ డ్రా చేసుకున్న ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం ఉప్పొంగుతోంది. కష్ట కాలంలో కేసీఆర్‌ సర్‌ ఆదుకున్నాడని ఆనంద భాష్పాలు రాల్చారు. పేదల పెద్ద కొడుకు మా కేసీఆర్‌ సార్‌.. ఆయనకు దండాలయ్యా.. మా సారు చల్లగా ఉండాలి అయ్యా.. అంటూ పాలమూరు మున్సిపల్‌ సిపాయి నరసమ్మ దీవించారు. తెలంగాణకు దేవుడు ఎవరంటే.. కేసీఆరే అని ఆ మహిళ చెబుతుంది. పాలమూరు జిల్లా కేంద్రానికి చెందిన శారద అనే గృహిణి కూడా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది.

About The Author