అన్నకు వీర తిలకం దిద్దిన సోదరి కవిత…

అన్నకు వీర తిలకం దిద్దిన సోదరి కవిత

యంగ్ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందు ప్రగతి భవన్ లో కుటుంబ సభ్యుల మధ్య అన్న కేటీఆర్ కు సోదరి కవిత వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు. పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్న నా ప్రియమైన సోదరుడికి శుభాకాంక్షలు అని తెలుపుతూ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. కేటీఆర్ తల్లి శోభా, ఆయన సతీమణి శైలిమకు కూడా కవిత తిలకం దిద్దారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ప్రగతి భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది.

About The Author