కన్నీటి రాదారి -కాలిబాట పట్టిన వలస కూలీలు…
కన్నీటి రాదారి -కాలిబాట పట్టిన వలస కూలీలు కొండలను పిండి చేసిన చేతులవి.. సుత్తి చేతబట్టి బండ రాయిని కంకరుగా మలచి కాయ కష్టానికి అలవాటుపడ్డ చేతులవి . 46 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకుని ఎర్రటి ఎండలో కొండెనక, గుట్టెనక చమటోడ్చి పనిచేసే కష్ట జీవులు . ఎంతటి విపత్తునైనా గుండె ధైర్యంగా ఎదుర్కొని కాయలు కట్టిన చేతులతో ముందుకు సాగే నిరుపేదలు వారు. ఎంతటి కష్టతరమైన పనినైనా అవలీ లుగా చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేదలు వారు. వారికి ఆకలి తప్ప భయమంటే తెలియని శ్రమజీవులు సైతం మొట్టమొదటి సారి కోరాన దెబ్బకి విలవిలలాడి పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేదలు కరోనా ధాటికి తట్టుకోలేక కంటతడి పెడుతున్నారు. దేవుడు , దేవాలయా లకు వెళ్లలేని వారంతా ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికి స్తున్న కరోనా నుంచి తమ కుటుంబాలకు ఎప్పుడు విముక్తి లభిస్తుంది దేవుడా అంటూ ప్రార్థిస్తున్నారు. గత నెల 22వ తేది నుంచి లాక్‌డౌన్ ప్రకటించడంతో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మే 3వ తేది వరకు విధించిన లాక్‌డౌన్‌ను తలుచుకుంటూ మున్ముందు ఎటువంటి పెనుసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో తలుచుకుంటూ కన్నీళ్లు పెడుతు న్నారు