శ్రీకాళహస్తి పూర్తిగా రెడ్ జోన్ .. జిల్లా కలెక్టర్
యువత రోడ్లపై తిరగడం వల్ల ఇంటిలోని పెద్దవారికి వ ఇబ్బందులు తలెత్తాయి…డిఐజి కాంతిరాణా టాటా
మీ ఆరోగ్యం పనిచేస్తున్నారనే బావన ప్రజల్లో కలగాలి..అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 : శ్రీకాళహస్తి పట్టణంలో ఇప్పటికే 34 కేసులు నమోదు కావడంతో రెడ్ జోన్ పరిధిలో కి వచ్చిందని నిత్యవసర వస్తువుల కోసం పదే పదే బయటకు రావడం గమనించామని ఇకపై డోర్ డెలివరీ ఏర్పాటు చేయనున్నామని దీనికే ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త తెలిపారు. కేసులు నమోదు ఎక్కువకావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో మంగళవారం రెడ్ జోన్ పరిధిలోని ప్రాంతాలను ఐజీ సంజయ్, అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా , జిల్లా కలెక్టరేట్ , అసిస్టెంట్ కలెక్టర్ పృద్వి తేజ్, ఆర్డిఓ కనక నరసారెడ్డి పర్యటించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో వీరు సమీక్ష నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. భవిష్యత్ లో కోవిడ్ కేసులు నమోదు కాకుండా సెకండరీ కాంటాక్ట్ వారిని ప్రక్కన ఉన్న వారిని తప్పనిసరి క్వారేంటైన్ కు తక్షణమే పంపడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని, నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు బయటకు వస్తున్నారని డోర్ డెలివరీ కి ప్రాధాన్యత ఇవ్వాలని, డీజే సౌండ్ సిస్టం తో నిరంతర ప్రచారం కలిగించాలని , కారణంగా లేకుండా బయటి తిరిగే టూవీలర్లు సీజ్ చేసి ఫైన్ వేయాలని, పోలీస్ అప్రమత్తం లేకుంటే కోవిడ్ నివారణ కష్టతరమవుతుందని, రానున్న రంజాన్ లో బయటకు రాకుండా ప్రార్ధనలు వంటివి సమీక్షలో నిర్ణయాలు తీసుకున్నారు.
*జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ నిన్న జరిగిన కోవిడ్ కెళుల సంఘటన తో భయపడి నేడు పాలు, నిత్యావసర వస్తువులు నేడు ఇబ్బంది అయ్యినదని నేడు మాట్లాడం జరిగింది సమస్య వుండదని అన్నారు. ప్రజలు గమనించాలని మన ప్రాణాలకు కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా కలిగిస్తున్నామని ఆలోచనతో లాక్ డౌన్ వరకు ఇంటికే పరిమితం కావాలని కోరారు.నిన్న ఘటన తో 660 శాంపిల్స్ తీస్తే అన్ని నెగటివ్ రావడం జరిగిందని తెలిపారు.
*డిఐజి కాంతిరణా టాటా* మాట్లాడుతూ ఇన్ని కేసులు వచ్చాయని భయపడాల్సిన పనిలేదని జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. రెడ్ జోన్ లో వాహనాలు తిరిగితే సీజ్ చేసి కేసులు పెట్టనున్నామని తెలిపారు. యువత బయటి తిరగడం వల్ల ఇంటిలోని పెద్ద వారికి ఎఫెక్ట్ అవుతుందనేది గమనించాలని అన్నారు. పరిస్థితి విషమించకుండా కేసులు ఎక్కువ ఉన్న దృష్ట్యా ఇంటికే పరిమితం కావాలని అన్నారు.
*అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి* మాట్లాడుతూ మీఆరోగ్యం కొసం అధికారులు నిరతంరం పనిచేస్తున్నారనే భావన రావాలని అప్పుడే సమిష్టి గా కోవిడ్ ను ఎదుర్కోగలుగు తామని అన్నారు. కంటైన్ మెంట్ జోన్ ప్రజలకు నిత్యావసర వస్తువులు వాలింటర్లు సరఫరా చేస్తారని వారికి కావలసిన వస్తువుల జాబితా తెలిపితే సరిపోతుంది, వస్తువులు అందించిన సమయంలో డబ్బు చెల్లించాలని కోరారు. అతిక్రమిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు.
అనంతరం కోవిడ్ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్, రెవెన్యూ వారిని అభినందిస్తూ గులాబీల ను అందంతో అందించి మరింత బాగా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్, అడిషనల్ ఎస్.పి.అనిల్ బాబు, తహసీల్దార్ గణేష్, సీఐలు నాగేమ్ ద్రుడు, నాగేశ్వర రెడ్డి, అవరో హనరావు, శివరాముడు , రెవెన్యూ పోలీసుల అధికారులు ఉన్నారు.
*డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి*