రూ.250లకే ఐదు కిలోల బంగినపల్లి…
మేలురకమైన బంగినపల్లి మామిడి పండ్లు ఐదు కిలోలు కేవలం రూ.250లకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఒక్కో పండు కనీసం 300 గ్రాముల సైజులో ఉండే నెంబర్ వన్ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ కల్గిన మామిడి పండ్లను నేరుగా వినియోగదారునికి అందజేయనున్నారు.
♦ రైతు వద్ద సేకరించి నూజివీడులోని ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హోంలోని రైబనింగ్ చాంబర్‌లో సహజ సిద్ధంగా మూడురోజుల పాటు మగ్గపెట్టిన మామిడిపండ్లను ప్యాకింగ్ చేసి రెడీ టూ ఈట్ పద్ధ్దతిలో అందజేస్తారు.
తొలుత విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఎక్కుగా ఉన్న చోట ఈ కిట్‌లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఉద్యాన శాఖ సిబ్బంది జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని అపార్టుమెంట్లు, విల్లాలు, గేటెడ్‌కమ్యూనిటీ ప్రాంతాలున్న చోటకు వెళ్లి ఈ కిట్‌ల కోసం వివరిస్తారు. అక్కడ నివాసితుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి వాటిని నేరుగా వారి ఇళ్లకే సరఫరా చేస్తారు.
ఉద్యాన రైతులను ఆదుకునేందుకే…
ఎగుమతుల్లేక ఇబ్బందిపడుతున్న ఉద్యాన రైతులను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వాదేశాలతో ఈ ఏర్పాట్లు చేస్తున్నాం.
మధ్యలో ఎలాంటి దళారీలకు ఆస్కారం లేకుండా రైతు నుంచి నేరుగా వినియోగదారునికి నాణ్యమైన పండ్లను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాం. సోమవారం నుంచి విజయవాడతో పాటు ప్రధాన పట్టణాల్లో కనీసం 100కిట్‌ల చొప్పున అందుబాటులో ఉంచుతున్నాం.
ఆసక్తి గల వారు నూజివీడు హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. రత్నమాల 7995086891ను ఫోన్‌లో సంప్రదిస్తే చాలు కావాల్సిన కిట్‌లు నేరుగా పంపిణీ చేస్తాం. *దయాకరబాబు, ఏడీ, ఉద్యానవన శాఖ*