కరోనా వైరస్ సోకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో…


కరోనా వైరస్ సోకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఖమ్మం జిల్లా పై సూర్యపేట జిల్లా ప్రభావం పడకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

ఖమ్మం జిల్లాలో కేసుల సంఖ్య 8కి చేరటంతో మంత్రి పువ్వాడ జిల్లా సరిహద్దు అయిన నాయకన్ గూడెం, నేలకొండపల్లి మండలం పైనంపల్లి చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS గారు, పోలీస్ కమీషనర్ తఫ్సిర్ ఇక్బాల్ IPS గారికి ఈ సందర్భమగా మంత్రి పలు సూచనలు చేశారు.

పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్న తరుణంలో ఖమ్మంలో నిన్న(మంగళవారం) పాజిటివ్ కేసులు రావాడంపై మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టుల వద్ద అధికారులు భద్రత పెంచాలని ఆదేశించారు. జిల్లాలో ఉత్పన్నమవుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వంకు వివరిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS గారు, సీపి తఫ్సిర్ ఇక్బాల్ IPS గారు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు పలువురు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశం లో కరోనా కట్టడికి దోహద పడే పలు అంశాల పై చర్చించారు. సూర్యాపేట జిల్లా నుండి ఒక్కరు కూడా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించకూడదని తగు ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పొరపాటు జరిగినా ఇక్కడ విధులు నిర్వర్తించే వారిపైనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నాయకుల పైరవులకు సైతం తలొగ్గకుండా పని చేయాలన్నారు. పరిస్థితిని అర్థం చెసుకోకుండా బాధ్యతా రాహిత్యంగా ఉన్న ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద వైద్యులు ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

అదే సమయంలో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఉపశమనం చర్యలు చేపట్టాలన్నారు.

బయట నుండి వచ్చిన వారి వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఇప్పటికైనా మేల్కొనాలని అన్నారు. అసందర్భంగా ఎవరు జిల్లాలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకు రవాణా తప్ప మరే ఇతర వాహనాలకు అనుమతులు ఇవ్వొదన్నారు. మోహమాటానికి పోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. నేలకొండపల్లి మండలంలోకి ఏప్రిల్ 1వ తేదీ నుండి 54 మంది వచ్చినట్లు రికార్డ్లో ఉందని వారిపై పర్యవేక్షణ అవసరం అన్నారు.
ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ కేసుల మూలలను తెంపే ప్రయత్నంలో నిమగ్నమైన అధికారులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. లాక్ డౌన్ ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. అదే సమయంలో సూర్యపేట జిల్లా నుండి ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించారాదని ఆదేశించారు.

About The Author