ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం…
కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాటలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కోసం దక్షిణ కొరియాతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. 5 లక్షల ర్యాపిడ్ కిట్లు సాధ్యమైనంత త్వరగా సరఫరా చేయాలని కోరింది. ఈ ఒప్పందం మేరకు ఏప్రిల్ 30 నుంచి కరోనా టెస్టింగ్ కిట్లను భారత్కు దక్షిణ కొరియా సరఫరా చేయనుంది. దక్షిణ కొరియా నుంచి గత వారం ఏపీ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే.(ర్యాపిడ్ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లు విడుదల)
కాగా, దక్షిణ కొరియా కరోనా టెస్టింగ్ కిట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్లో వివరించారు. చైనా నుంచి సకాలంలో టెస్టింగ్ కిట్ల సరఫరా జరగకపోవడంతో పాటు నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సూచనతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
#APCMYSJagan #YSJaganMarkGovernance