పల్లెపల్లెనా ధాన్యపురాశులే…మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .


మెదక్ జిల్లా మెదక్, కొల్చారం మండలాలలో కొల్చారం, అప్పాజీపల్లి, చిన్న ఘణపూర్, అంబోజిపల్లిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసి మెదక్ కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు, క్యాబ్ డ్రైవర్లకు నిత్యావసరాలు సరఫరా చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .
– పక్కా ప్రణాళికతో పంటల కొనుగోళ్లు
– దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కొనుగోళ్లు
– కరోనా విపత్తులోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
– ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూ.30 వేల కోట్లు సమకూర్చిపెట్టడం అనేది సాహసోపేత చర్య
– ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదు
– గత ఆరేళ్లలో కేసీఆర్ గారు ప్రణాళికాబద్దంగా చిత్తశుద్దితో ప్రాజెక్టులు పూర్తి చేయడంతో తెలంగాణ నేడు అన్నపూర్ణగా మారింది
– దేశానికి రేపు దారి చూపేది తెలంగాణ రాష్ట్రమే
– తెలంగాణలో జరుగుతున్న కొనుగోళ్లు, మార్కెటింగ్ విధానం గురించి మిగతా రాష్ట్రాల వారు ఆసక్తితో తెలుసుకుంటున్నారు
– లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లో
ప్రజల ఇండ్ల వద్దకే పండ్లు, కూరగాయలు అందజేస్తున్నాం
– వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి
– వైద్య, పోలీసు, పారిశుద్ధ్య, రైతులకోసం వ్యవసాయ, మార్కెటింగ్, సహకార సిబ్బంది ప్రజలకోసం చేస్తున్న సేవలు అమూల్యమైనవి
– వ్యవసాయ, మార్కెటింగ్ ఉద్యోగుల మీద పోలీసుల చర్యలు గర్హనీయం
– ప్రజలకోసం పోలీసుల మాదిరే రైతులకోసం వీళ్లు పనిచేస్తున్నారు
– ఉద్యోగుల వద్ద పాసులు చూసేంత తీరికలేని కొందరివల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు
– దుబ్బాక, వరంగల్ ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లాం .. బాధ్యులపై చర్యలు తీసుకుని మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు
– మెదక్ జిల్లా మెదక్, కొల్చారం మండలాలలో కొల్చారం, అప్పాజీపల్లి, చిన్న ఘణపూర్, అంబోజిపల్లిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసి మెదక్ కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు, క్యాబ్ డ్రైవర్లకు నిత్యావసరాలు సరఫరా చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలెక్టర్ ధర్మారెడ్డి , ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి , పద్మా దేవేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి తదితరులు.

About The Author