ఏపి హోంమంత్రి ని కలసిన గుంటూరు APUWJ నేతలు…


కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు వివిధ విభాగాలకు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల భీమా సదుపాయాన్ని జర్నలిస్టులకు వర్తింపచేయాలని ఏపి హోంమంత్రి మెకతోటి సుచరిత ను కలసిన గుంటూరు జిల్లా యూనియన్ నేతలు..జిల్లా అద్యక్ష,కార్యదర్మిలు మీరో,మేచూరి శివ,రాష్టృ నాయకులు గిరి లు కలసి వినతిపత్రం అందజేశారు.రాష్ట కమిటి పిలుపుమేరకు ఏపిలో జర్నలిస్ట్ లకి సున్నిత ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులందరికీ పీపీఈ కిట్లు, మాస్క్లు, శానిటైజర్లు ఇవ్వాలని,కరోనా నేపథ్యంలో వివిధ విభాగాలకు అమలు చేస్తున్న రూ.50 లక్షల బీమా సదుపాయాన్ని వర్తింపచేయాలి.రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న జర్నలిస్టుల హెల్త్ కార్డుల పథకం గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసినందున 2020-21 సంవత్సరానికి కూడా అంతరాయం కలగకుండా కొనసాగేలా ఆదేశాలివ్వాలని కోరుతు అలాగే జర్నలిస్టుల వైద్య ఆరోగ్య సేవలకు అత్యధిక పాత్రికేయులకు సరైన వేతన వ్యవస్థ లేదు. వారి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండి ఇబ్బందులుపడు తున్నారు. సమాజంలో వివిధ వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహకారాన్ని పాత్రికేయులకూ అమలు ప్రబుత్వం దృష్టి పెట్టాలని కోరారు.హోంమంత్రి మాట్లాడుతు ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నిలిస్ట్ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని,ప్రాణాలనుి సైతం లేక్క చేయకుండ వృత్తి ధర్మం నిర్వహిస్తున్నారని తమ ప్రబుత్వం ఏప్పుడు జర్నలిస్ట్ లకు అండగా ఉంటోందని,ఆ ఆంశంన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెడతానని,మీ న్యాయంపరమైన డిమెంట్స్ పరిష్కంకోసం తప్పకుండ నా వంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు…

About The Author