కోవిడ్19 24 గంటల్లో 5500 పరీక్షలు చేస్తే 82 పాజిటివ్ వచ్చాయి.
80,334 టెస్టులు ఇప్పటి వరకు నిర్వహించాము
పది లక్షల జనాభా కు 1504 టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ నే. మిగతా రాష్ట్రాలు మనకంటే వెనకే ఉన్నాయి. ఎన్ని పరీక్షలు ఎక్కువ చేస్తే అన్ని ఎక్కువ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది.
దేశంలో 7 లక్షల 16 వేల 232 పరీక్షలు చేస్తే 23 వేల వరకు పాజిటివ్ కేసులు వచ్చాయి.
పజిటివిటి రేటు 4.16గా ఉంది.
కానీ ఏపీ లో కేవలం 1.57 పాజిటివీటి రేటు . మనమే తక్కువగా ఉన్నాం.
మనం భయపడాల్సింది ఏమి లేదు.
తక్కువ టెస్టులు చేసి తక్కువ కేసులు వస్తే ఉపయోగం ఏమిటి.
ప్రస్తుతం కేసులు కంటైన్మెంట్ క్లస్టర్లు లొనే వస్తున్నాయి.
ఇతర ప్రాంతాలకు విస్తరించడం లేదు.
ఈ జోన్లలో ప్రైమరీ కంటాక్టులు, వారి సన్నిహితులను గుర్తిస్తూ ఐసోలెట్ చేస్తున్నాం. తక్కువ స్థాయి లో లక్షణాలు ఉన్నాయో వారిని
హోమ్ ఐసోలేషన్ లొనే ఉంచుతాం
మిగతా వారిని కోవిడ్ సెంటర్లకు తరలిస్ఘాం
ప్రస్తుతం వచ్చిన కేసుల పై భయపడాల్సింది ఏమి లేదు.
ఇవాళ వచ్చిన వాటిలో 7 మాత్రమే క్లస్టర్ బయట వచ్చాయి.
వైరస్ కేసుల డబులింగ్ టైం ఏపీ లో 9 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ వరకు ఉన్న సమయంలో 9.8 రోజులుగా ఉంది.
టెలిమెడిసిన్ కోసం 8 వేలకు పైగా కాల్స్ వచ్చాయి.
డాక్టర్ సూచించిన ప్రెస్క్రిప్షన్ ద్వారా మందులు అందిస్తున్నాం
స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మందులు ఇంటికే అందిస్తున్నాం
పరీక్షల సామర్థ్యం పెరిగింది
9 వైరాలజీ లాబ్ ల ద్వారా పరిక్ష లు పెంచాం
పశ్చిమగోదావరి, విజయనగరం మినహా అన్ని చోట్లా ల్యాబ్స్ ఏర్పాటు చేసుకున్నాం
31 మంది ఆరోగ్య సిబ్బందికి సోకింది. ఇందులో 12 డాక్టర్లు ఉన్నారు.
రాజ్ భవన్ సిబ్బంది 4 గురికి సోకింది.
గవర్నర్ కు కూడా పరీక్షలు చేశాం ఆయనకు నెగెటివ్ వచ్చింది
కె.ఎస్ జవహర్ రెడ్డి
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి