వైసీపీ ఎంపీకి షాక్..అనకాపల్లి ఎంపీ అప్పనంగా రేషన్‌ బియ్యం?


*- డాక్టరమ్మా.. ఇదేంటమ్మా!?*

*- అనకాపల్లి ఎంపీ సత్యవతి పుట్టిన రోజు వేడుకలకు అప్పనంగా రేషన్‌ బియ్యం?*

*- ‘దారిమళ్లింపు’పై కదిలిన అధికార యంత్రాంగం*

*- జాయింట్‌ కలెక్టర్‌ విచారణ*

*- అనకాపల్లి ఆర్డీవోతో సమావేశం*

*- పౌరసరఫరాల శాఖ ఏఎస్‌వో, సీఎస్‌డీటీలను ప్రశ్నించిన శివశంకర్‌*

*- ఎంపీకి చెందిన ట్రస్ట్‌పై 6ఏ కేసు నమోదు*

*- బియ్యం తరలించిన డీలర్‌, ఎంఎల్‌ఎస్‌పీ ఇన్‌చార్జి సస్పెన్షన్‌*

*- జన్మదిన వేడుకల్లో పంపిణీకి బియ్యం పంపాలంటూ డీలర్లకు ప్రజా ప్రతినిధి హుకుం*

★ అనకాపల్లి ఎంపీ సత్యవతికి రెవెన్యూ అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు.

★ సోమవారం రాత్రి రేషన్‌ బియ్యం అన్‌లోడ్‌ జరిగిన కల్యాణ మండపం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వివేకానంద ట్రస్ట్‌ (ఎంపీ కుటుంబ సభ్యులది)పై పోలీస్‌ కేసు నమోదుకు ఆదేశించారు.

★ ఎంపీ కుటుంబానికి చెందిన కల్యాణ మండపంలో సోమవారం రాత్రి చౌక బియ్యం అన్‌లోడ్‌ చేస్తుండగా సీపీఎం నేతలు పట్టుకున్న సంగతి తెలిసిందే.

★ ఈ విషయాన్ని *‘దారిమళ్లిన రేషన్‌ బియ్యం’* శీర్షికన మంగళవారం ప్రముఖ ఛానల్ వార్త ప్రచురించడంతో జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ అనకాపల్లి వెళ్లి విచారణ జరిపారు. 

★ పట్టణంలోని మూడు రేషన్‌ డిపోలకు చేరాల్సిన బియ్యం పక్కదారి పట్టడంపై మంగళవారం ప్రముఖ ఛానల్లో వచ్చిన కథనంపై పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు.

★ శంకరం గ్రామంలో వున్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌(రేషన్‌ గోదాము)లో ఏఎస్‌వో కోట్ని మధు, సీఎస్‌డీటీ జయ తనిఖీలు చేపట్టారు.

★ గోదాము ఇన్‌చార్జి కె.రమణను విచారించారు. రేషన్‌ డిపోలకు వెళ్లాల్సిన లారీ పక్కదారి ఎందుకు పట్టింది? దీనిని బాధ్యులు ఎవరు?, వంటి పలు విషయాల గురించి ఆరా తీశారు.

★ గోదాము ఇన్‌చార్జి రమణ బదులిస్తూ…. అవి పట్టణంలోని 14, 15, 30 నంబర్ల రేషన్‌ డిపోలకు కేటాయించిన బియ్యం అని, 14వ డిపోకి 100, 15వ నంబరు డిపోకి 100, 30వ నంబరు డిపోకి 10 బస్తాల చొప్పున ఏపీ35 వి 7482 నంబరుగల వ్యాన్‌లో ఇక్కడి నుంచి తీసుకువెళ్లారని, తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు.

_*జేసీ శివశంకర్‌ విచారణ.. ట్రస్ట్‌పై కేసు నమోదు*_

★ జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ మంగళవారం అనకాపల్లి ఆర్డీవో కార్యాలయానికి వచ్చి, రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిన వైనంపై విచారణ చేపట్టారు.

★ బియ్యం దారిమళ్లింపు వాస్తవమేనని విచారణలో తేలడంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేశారు. అలాగే 30వ నంబరు డిపో డీలర్‌ను కూడా సస్పెండ్‌ చేశారు.

★ వాహనాన్ని దారిమళ్లించిన కాంట్రాక్టర్‌-2 వాహనాన్ని సీజ్‌ చేసి, బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

★ వాహనంలో పది టన్నుల బియ్యం తరలింపునకు మాత్రమే రిలీజ్‌ ఆర్డర్లు వుండగా, 10.5 టన్నులు తీసుకువెళ్లినట్టు తేలడంతో సంబంధితులపై చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ డీవీఎంకు సూచించారు.

★ ఎంపీ ట్రస్టుపై 6ఏ కేసు పెట్టాలని డిప్యూటీ తహసీల్దార్‌ను ఆదేశించారు. 

About The Author