ప్యాంటు లేకుండానే న్యూస్‌ లైవ్‌లోకి వచ్చిన జర్నలిస్ట్…


వాషింగ్టన్: వర్క్‌ ఫ్రమ్ హోం మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని రకాల జోక్‌లు వైరల్ అవుతున్నాయి. ఆఫీసులకి సూటులో వచ్చే వారు ఇప్పుడు లోయర్స్, లుంగీలతో ఇంట్లో పని చేస్తున్నారని, ఉన్నట్టుండి వీరికి బాస్ వీడియో కాల్ చేస్తే పరిస్థితి ఏంటని నెటిజెన్లు సరదాగా జోకులు వేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సంఘటనే అమెరికాలో ఒకటి జరిగింది. అమెరికాకు చెందిన ఓ న్యూస్ ఛానల్‌లో మార్నింగ్ లైవ్ షోలో భాగంగా ఇంటి నుంచి పని చేస్తున్న ఓ జర్నలిస్ట్‌ వైపుకు సడెన్‌గా కెమెరా తిరిగింది. అంతే పైన కోటు ఉంది కానీ, కింద ప్యాంటు లేదు. కనిపించింది క్షణ కాలమే అయినా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీడియా సేవలు కొనసాగుతూనే ఉంటాయి. తమతో పాటు తమ సామాన్లను రవాణా చేయడం టీవీ జర్నలిస్టులకు అత్యంత కష్టమైన పని అయినప్పటికీ ఏదో విధంగా తమ సహచర ఉద్యోగులతో కమ్యూనికేట్ అవుతూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే ఇంటి నుంచి అన్ని వ్యవహారాలను నియంత్రించలేము. కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రత్యక్ష ప్రసారాల సమయంలో కూడా ఇలాంటి సహజమేనని కొందరు నెటిజెన్లు చెప్పుకొచ్చారు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫొటోలు, తనపై నెటిజెన్లు వేస్తున్న జోకులపై సదరు జర్నలిస్ట్ స్పందించాడు. ఒక్కసారిగా లైవ్‌లోకి రావాల్సిన పరిస్థితుల్లో అలా జరిగిందని చెప్పుకొచ్చాడు.

About The Author