ఒక్కమాటలో చెప్పాలి అంటే శ్రీవారే లేకపోతే తిరుపతి మనుగడే లేదు అంతే….
శ్రీవారు – తిరుపతి – లోక్ డౌన్
ఒక్కమాటలో చెప్పాలి అంటే శ్రీవారే లేకపోతే తిరుపతి మనుగడే లేదు అంతే….
కరోనా భయంతో మార్చ్ 23 వతేది తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లకు సంబంధించిన tollgate లు రెండు మూసి వేసిన తరువాత..శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు లేకుండ దర్శనము నిలిపి వేసిన తరువాత ..ఈ 40 రోజులలో తిరుపతి, తిరుపతి చుట్టు ప్రక్కల చాలా గ్రామాలలో ప్రజల జీవన శైలి లో చాలా మార్పులు వచ్చాయి…
దాదాపుగా ఇక్కడ 85% ప్రజలకు జీవనాదారం శ్రీవారి తో ముడిపడి ఉంటుంది…అలాంటిది తిరుమలకు భక్తులు రాలేక పోయేసరికి తిరుపతి ప్రజలు ఆదాయ మార్గాలు లేక నిదానంగా కష్టాల ఊబిలో చిక్కుకు పోతున్నారు…
టీటీడీలో పని చేసే రెగులర్ ,కాంట్రాక్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ,కార్మికులు అంత కలిసి దాదాపుగా 22000 కుటుంబాలు.. వీరిలో కొంత మందికి సగం జీతం వచ్చాయి మిగతా వారికి అవికూడా లేవు..
ఇక తిరుపతి నుండి తిరుమల యాత్రికులను చేరవేసే ప్రైవేట్ కార్లు, వాన్లు, సుమో లు, ఇతర వాహనాలు అందులో పనిచేసే డ్రైవర్లు దాదాపుగా 4000 కుటుంబాలు వారి జీవనోపాధి కోల్పోయారు..
తిరుమల , తిరుపతిలలో యాత్రికులకు భోజన సౌకర్యం కలిపించే చిన్న ,పెద్ద హోటళ్లు లో పనిచేసే వారు దాదాపుగా 7000 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి..తిరుమలలో వివిధ వస్తువులు విక్రయించే దుకాణాలు మూసివేయడంతో వాటి పై ఆధార పడిన వారి రోదన అంతా ఇంతా కాదు… ఇంకా తిరుమలలొనే బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న కుటుంబాలవారు నిత్యవసరాలలేమి తో పడే బాధలు వర్ణనాతీతం.. రైల్వే, rtc బస్ స్టేషన్ నుంచి యాత్రీకులను తీసుకెళ్లే ఆటో కార్మికుల బ్రతుకులు చెడింది… తిరుపతి లాడ్జిలు, రెసిడెన్సీలలో చుట్టు ప్రక్కల పల్లెలు ,గ్రామలనుండి పని చేసే వేల మంది సిబ్బంది జీవనోపాధి కోల్పోయారు..
ఇలా చేప్పుకొంటు పోతే ప్రతీది శ్రీవారితో ముడిపడిందే.. చుట్టు ప్రక్కల ప్రదేశాలనుండి శ్రీవారిని నమ్ముకుని తిరుపతికి వచ్చి చేరిన చిన్న చితక బ్రతుకులు లాక్ డౌన్ పుణ్యమా అని ఇంటిఅద్దెలు కట్టలేక పూటగడవడం కూడా కష్టంగా మారుతోంది.. మార్చ్ 27 వరకు ttd వారు ఇస్తున్న 56000 ఆహార పొట్లాలు నిలిపివేసేశారు.. ఈ నెల రోజులలో మానవతా వాదులు అక్కడక్కడ సహృదయంతో విరళాలతో ఆదుకున్నారు.. కూడా రోజులు గడవటంతో తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది..
ఈ లాక్ డౌన్ ఇలాగే కొనసాగినా, ఒక వేళ లోక్ డౌన్ ఎత్తివేసినా శ్రీవారి చెంతకు యాత్రికులురానన్ని రోజులు తిరుపతి లో లక్షల మంది కి జీవనోపాధి లేక ఆకలితో అలమటించవలసిందే…
మిగతా ప్రదేశాలలో జీవనోపాధికి వేరే వేసులుబాటులు ఉన్నాయి.. తిరుపతి కి మాత్రం శ్రీవారే దిక్కు..
ఇంక అంతా నీదే భారం “నా స్వామి”..ఓం నమో వేంకటేశాయ..