హతుడు ఐబి ఉద్యోగి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం…


ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత శర్మ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం మంజూరుకు ఢిల్లీ క్యాబినెట్ సోమవారం ఆమోదించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు. రూ. కోటి మంజూరు చేయాలని మార్చి మొదటి వారం లో నిర్ణయించారు. ఈ మొత్తం ఆ కుటుంబానికి వేగంగా అందుతుందని ఆశిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. హతుడు అంకిత శర్మ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఆనాడు అల్లర్లు ఎక్కువగా జరిగిన చాంద్ బాగ్ ఏరియాలో ఆయన ఉండేవారు. ఫిబ్రవరి 26న ఆయన మృతదేహాన్ని కాలువ నుంచి వెలుపలికి తీశారు. ఈ హత్యకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. కుటుంబీకుల అనుమానంపై సస్పెండైన ఆప్ కౌన్సిలర్‌ను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు.

About The Author