స్కూళ్లలోనూ సరి-బేసి…
స్కూళ్లలోనూ సరి-బేసి విధానం అమలు చేయాలని కేంద్ర మానవవనరుల శాఖ భావిస్తోంది. కరోనా ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేకపోవడంతో స్కూల్‌లోని మొత్తం విద్యార్థుల్లో కేవలం 50 శాతం మంది మాత్రమే హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఉదాహరణకు ఓ స్కూల్లో 1-10 వరకు ఉంటే ఒక రోజు సగం క్లాసుల స్టూడెంట్స్, మరో రోజు మిగతా సగం క్లాసుల విద్యార్థులు వచ్చేలా ఆలోచనలు చేస్తున్నారు. దీంతో పిల్లల మధ్య భౌతిక దూరం పాటించే అవకాశం ఉంటుంది…
మూడు రోజులే స్కూల్స్ .. మూడు రోజులు ఇంట్లోనే డిజిటల్ క్లాసులు
మూడు రోజులు మాత్రమే విద్యార్థులు స్కూల్స్ కు వెళ్ళేలా చేసి మిగతా మూడు రోజులు టీవీ ఛానల్స్ ద్వారా పాఠాలను వినాల్సి ఉంటుంది. ఇక అంతేకాదు కేంద్రం కేవలం విద్యార్థులు కోసం 12 ఛానల్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. డిజిటల్ ఛానల్స్ ద్వారా మూడు రోజులపాటు స్కూల్ పాఠాలు చెప్పనున్నారు. స్కూల్ ద్వారా మరో మూడు రోజులపాటు పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నది కేంద్రం. ఈ విధానం సక్సెస్ అయితే డిజిటల్ విద్యావ్యవస్థలో పెను మార్పులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది…
విద్యా విధానంలో సమూల మార్పులకు కారణం అవుతున్న కరోనా లాక్ డౌన్
ఇక ఇప్పటికే కరోనా లాక్ డౌన్ ప్రభావం స్కూల్స్ కు వెళ్ళే విద్యార్థులు మీద చాలా దారుణంగా పడింది. స్కూల్స్ కు ఎక్కువ కాలం సెలవులు ఇవ్వడం వలన పిల్లలు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి . ఇక స్కూల్స్ విషయంపై మానవ వనరుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్కూల్స్ ను మూడు రోజుల పాటే సామాజిక దూరం పాటిస్తూ , మాస్కులు ధరిస్తూ నిర్వహించాలని భావిస్తోంది. ఇక మూడు రోజుల పాటు డిజిటల్ విద్యా విధానం అలవాటు చెయ్యాలని సర్కార్ యోచిస్తుంది . దీనికోసం త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతున్నది…