రంజాన్‌ ప్రార్థనలు ఇంట్లనే చేసుకోండి…


రంజాన్‌ ప్రార్థనలు ఇంట్లనే చేసుకోండి
ఫత్వా జారీ చేసిన దరుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌

న్యూఢిల్లీ: ముస్లిం సోదరులంతా రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే చేసుకోవాలని ఇస్లామిక్‌ సెమినరీ దరుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌ ఫత్వా జారీ చేసింది. ఎవ్వరూ మసీదులకు వెళ్లొద్దని ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని చెప్పింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఫత్వా జారీ చేసినట్లు చెప్పింది. ప్రార్థనలకు సంబంధించి సెమినరీని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ఫత్వా జారీ చేసినట్లు చెప్పారు. శుక్రవారం ప్రార్థనలు జరుపుకుంటున్నట్లుగానే పండుగ రోజు కూడా కొనసాగించాలని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నమాజ్‌ను సాధారణంగా చేయడం క్షమించదగినదని అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని అన్ని గుళ్లు, మసీదులు, చర్చిలను ప్రభుత్వం బంద్‌ పెట్టింది. కాగా.. రంజాన్‌ మాసం కావడంతో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఈ ఏడాది రంజాన్‌ పండుగ మే 24, 25లో రానుంది.

About The Author