గ్రామీణ కరోనా రోగుల కోసం మొబైల్‌ ఐసీయూ నేడు ప్రారంభించనున్న మంత్రి ఈటల


హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో ఎవరికైనా కరోనా సోకితే గాంధీ లేదా ఇతర ఆసుపత్రికి తరలించి ఐసీయూ, వెంటిలేటర్‌ లాంటి సౌకర్యాలు కల్పించి సత్వర చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. ఏ మారుమూల పల్లెలోనో వెంటనే వెంటిలేటర్‌ కావాలంటే సాధ్యం కాదు. సమీపంలోని ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రికి తరలించాలి. అక్కడా ఐసీయూ ఉంటుందో లేదో తెలియదు. కొవిడ్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అలాంటి అత్యవసరమైన రోగులకు వినియోగించేందుకు హైదరాబాద్‌ నగరానికి చెందిన గ్రేస్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ మొబైల్‌ ఐసీయూను తీర్చిదిద్దింది. ఇందులో మూడు పడకలు, రెండు వెంటిలేటర్లతో పాటు ఐసీయూలో అవసరమైన అన్ని వసతులు ఉంటాయి. తొలుత నిజామాబాద్‌లోని ఇందూరు కేన్సర్‌ ఆసుపత్రిలో ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మొబైల్‌ ఐసీయూను కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం ప్రారంభించనున్నారు.

About The Author