పిడుగుపాటుకు విద్యుత్తు ఉపకేంద్రం దగ్ధం…


పిడుగుపాటుకు విద్యుత్తు ఉపకేంద్రం దగ్ధం…సబ్‌స్టేషన్‌లో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
నార్కట్‌పల్లి మండలం కామినేని ఆసుపత్రి సమీపంలోని 220/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో పిడుగు పడటంతో బుధవారం మంటలు చెలరేగాయి. పిడుగుపాటుకు సబ్‌స్టేషన్‌ పాక్షికంగా దెబ్బతినిందని ఎస్‌ఈలు లక్ష్మణ్‌రావు, కృష్ణయ్య తెలిపారు. సుమారు రూ.30లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఈ ఉపకేంద్రం నుంచి నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్‌, కట్టంగూరు మండలాలకు విద్యుత్తు సరఫరా అవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ఇతర ప్రాంతాల నుంచి సింగిల్‌ లైన్‌ ద్వారా సరఫరా జరుగుతోందన్నారు. వారంలో ఉపకేంద్రాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఘటనాస్థలిని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు.

About The Author