కొడలిపై అత్యాచారం చేయబోయిన మామా చివరికి ఏమైంది అంటే…
ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టిన కొత్తకోడలికి ఊహించని ఘటన ఎదురైంది. కొడుకు భార్యని కూతురిలా భావించాల్సిందిపోయి కోడలిపై కామంతో చెలరేగిపోయాడు మామ. పెళ్లైన కొద్దిరోజులకే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. డబుల్ మీనింగ్ డైలాగులు.. అసభ్యంగా తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అదే విషయం అత్తకి చెబితే నోరుమూసుకోమంది. చివరికి తన బాధను భర్తకి చెబితే నమ్మకపోవడంతో ఆధారాలతో సహా పట్టించింది. ఈ అమానుష ఘటన పంజాబ్లోని పంద్రవాడ ఏరియాలో జరిగింది.
ఇరవై ఏళ్ల యువతికి ఐదు నెలల కిందట గతేడాది డిసెంబర్ 19న పంద్రవాడకి చెందిన యువకుడితో వివాహమైంది. పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఆమెకి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. కన్నకూతురిలా చూసుకోవాల్సిన మామ ఆమెపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెట్టాడు. మామ ప్రవర్తనతో భయపడిపోయిన కోడలు విషయం అత్తకి చెప్పింది. ఆమె మౌనంగా ఉండమని ఆదేశించింది.
ఏం చేయాలో పాలుపోక భర్తకి చెప్పుకుని బాధపడింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. భర్త ఆమె మాటలను నమ్మలేదు. ఈ క్రమంలో ఇంట్లో కోడలు ఒంటరిగా ఉన్న సమయంలో మామ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఎలాగో తప్పించుకున్న కోడలు విషయాన్ని భర్తకి చెప్పింది. ఈ సారి ఆమెకు భారీ షాకిచ్చాడు భర్త. మరోసారి అలా జరిగితే తన ఫోన్లో వీడియో తీయాలని సూచించాడు.
ఇవేవీ తెలియని మామ కామంతో రెచ్చిపోయాడు. కొడుకు ఇంట్లో లేని సమయంలో మరోసారి కోడలిపై అత్యాచారం చేసేందుకు విఫలయత్నం చేశాడు. భర్త సూచనల మేరకు మామ బాగోతాన్ని వీడియో తీసిన కోడలు.. భర్తకి చూపించడంతో పాటు పోలీసులను ఆశ్రయించింది. అత్యాచార యత్నం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు