ఇక తక్షణమే పాన్ కార్డు – అది కూడా ఫ్రీగా..!
పాన్ కార్డు లేని వారందరికీ గుడ్‌న్యూస్.. ఇప్పటి వరకు పాన్ కార్డ్ పొందాలంటే కనీసం పది రోజులైన వేచి చూడాల్సి వచ్చేది. అంతేకాదు.. ట్రాకింగ్ వివరాలు తెలియక కూడా ఎంతో మంది ఇబ్బంది పడేవారు.
ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ.. ఇక క్షణాల్లో పాన్ కార్డు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు తక్షణమే పాన్ కార్డు (ఇన్స్టాంట్ పాన్) అందే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు.
అయితే ఈ పాన్ కార్డు పొందాలంటే వారకి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కలిగి ఉండటంతో పాటుగా.. ఆ ఆధార్ నంబర్ మొబైల్ నంబర్‌తో లింక్ అయ్యి ఉండాలి.
ఇలా ఉన్న వారికి ఎలాంటి పేపర్ అవసరం లేకుండానే క్షణాల్లో పాన్ కార్డ్ (ఈ-పాన్) పొందవచ్చు. అంతేకాదు ఈ ఈ-పాన్ కార్డ్ ఈష్యూ చేసేందుకు ఎలాంటి రుసుము కూడా ఉండదని తెలిపారు.
అంటే ఈ-పాన్ ఉచితమే అన్నమాట. ఈ సదుపాయంతో డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.