శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం ….
తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది.
ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు.
జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి.
దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశలవారీగా ఇప్పటికే పూర్తి చేశారు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
అరకొర ఏర్పాట్లు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్దేశిత గడువు నాటికి కొన్ని ఆంక్షలతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల రాకకు అనుమతించనుంది.
*దేవాలయాల దర్శనానికి అనుమతి..*
సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ 5 అమలులోకి రానున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. భారీగా సడలింపులనూ ప్రకటించింది.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారా ఇతర ప్రార్థనా మందిరాలను జూన్ 8వ తేదీ నుంచి భక్తుల కోసం తెరచుకోవడానికి అనుమతిని ఇచ్చింది.
ఫలితంగా- అదేరోజున తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రాకను పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు.