లాక్‌డౌన్‌ 5 గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేసిన తమిళనాడు…


*- చెన్నైలో నో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌*

*- అంతర్‌‌ రాష్ట్ర సర్వీసులకు నో పర్మిషన్‌*

*- మెట్రో, ఆలయాలు తెరవడంపై ఆంక్షలు*

★ లాక్‌డౌన్‌ 5కి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేసింది.

★ రాష్ట్రంలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు.

★ జూన్‌ 8 తర్వాత పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రెస్టారెంట్లను తెరిచేందుకు పర్మిషన్‌ ఇచ్చారు.

★ కంటామినేటెడ్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. చెన్నై, తిరువెళ్లూరు, చెంగళ్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అనుమతి లేదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 50 శాతం బస్సులు తిరుగుతాయని చెప్పారు.

★ స్టేట్‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌, కేంద్ర హోంశాఖ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం జూన్‌ 30 వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

★ దేవాలయాలు, మెట్రో, ఇంటర్‌‌ స్టేట్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, సబ్‌ అర్బన్‌ ట్రైన్స్‌పై బ్యాన్‌ కొనసాగుతుందని అన్నారు.

★ కంటామినేటెడ్‌ జోన్లలో తప్పి మిగతా ప్రదేశాల్లో అన్ని షోరూమ్‌లు, షాపులు, రెస్టారెంట్లలో కేవలం 50 శాతం మంది వర్కర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

★ ట్యాక్సీలు, ఆటోలు పాసులు లేకుండా తిరిగేందుకు అనుమతి ఇచ్చారు.

★ చెన్నైలో కేసులు ఎక్కువగా ఉన్నందున ఐటీ కంపెనీల్లో కేవలం 20 శాతం మందికి మాత్రమే అనుమతించారు.

★ కాగా.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 శాతం ఎంప్లాయిస్‌ అనుమతించనున్నారు.

About The Author