ప్రారంభమైన రైళ్లు.. విజయవాడలోబారులు తీరిన ప్రయాణికులు
దాదాపు రెండున్నర నెలల తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో మళ్లీ కళకళలాడుతోంది. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో క్యూ రోడ్డుపైకి వచ్చేసింది.
స్టేషన్‌లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపిస్తారు. కాగా, ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లు కూడా జారీ చేయనున్నారు. స్టేషన్లలోని ఫుడ్‌కోర్టులు, ఇతర దుకాణాలు తెరుచుకున్నప్పటికీ పార్శిళ్లు మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.