గుంటూరు మార్కెట్ పై కరోనా పంజా …ఒకరి నుంచి 26 మందికి…


ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 3200 కి చేరింది. ఈ ఒక్కరోజే ఏపీలో 115 కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 కేసులు గుంటూరు నగరంలో నమోదుకావడం విశేషం. గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైతే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి లాక్ డౌన్ చేస్తున్నారు.
ఇక గుంటూరులో కొల్లి శారదా కూరగాయల మార్కెట్ గుర్తింపు పొందిన మార్కెట్. ఆ మార్కెట్ లో ఇప్పుడు కరోనా కలకలం సృష్టిస్తోంది. కొల్లి శారదా మార్కెట్లో 18 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఈ మార్కెట్ లో కూరగాయల వ్యాపారికి, అతని ఇంట్లోని ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఈ కూరగాయల వ్యాపారి ఉండే పక్క ఇంట్లో ఇద్దరికీ కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. ఒక కొల్లి శారదా మార్కెట్ లోని ఓ వ్యాపారి నుంచి 26 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొల్లిశారదా మార్కెట్ లో 250 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

About The Author