సమ్మక్క బ్యారేజీకి 68.9 ఎకరాల అటవీ భూమి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్మిస్తున్న సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 68.9 ఎకరాల అటవీశాఖకు చెందిన భూమిని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖకు బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ తుది అనుమతులను కూడా కేంద్రం ఆమోదించింది.
దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరాయంగా నీటిని అందించేందుకు ప్రభుత్వం గోదావరి నదిపై సమ్మక్క బ్యారేజీ నిర్మిస్తోంది. దీనికి ప్రస్తుత ఏటూరునాగారం, వెంకటాపురం అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూమి కావాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది