ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..


◆రాష్ట్రమంతా సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

◆మనుషులకు ఆధార్ ఉన్నట్లు గానే.. భూములకు కూడా గుర్తింపు ఉండాలని అందుకే ప్రతీ భూమిని గుర్తించి వాటికి *‘భూధార్’* నెంబర్ కేటాయించాలని ఆదేశించారు..

*ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి జీవో జారీ చేశారు..*

◆అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటివ్ రిఫరెన్స్ స్టేషన్స్(కార్స్) టెక్నాలజీ ద్వారా భూములను రీసర్వే చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

◆కాగా, రాష్ట్రమంతా భూసర్వేలో భాగంగా మొదటిదశ పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తొలుత రీసర్వే చేయనుండగా..

*దీని కోసం ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో పెట్టిన రూ. 200.15 కోట్లకు ఆమోదం తెలపాలని సర్వే సెటిల్‌మెంట్‌ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు..*

About The Author