విశాఖ వైద్యుడు సుధాకర్ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతి…
:-విశాఖ వైద్యుడు సుధాకర్ తల్లి వేసిన హేబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
:-విశాఖ వైద్యుడు సుధాకర్ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతించింది.
:-సీబీఐ విచారణకు సహకరించాలని డాక్టర్ సుధాకర్‌కు సూచించింది.
:-ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని పేర్కొంది.
:-మరోవైపు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.
:-నర్సీపంట్నం చేరుకున్న సీబీఐ అధికారులు… స్థానిక మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని విచారించారు.
:-తొలుత సుధాకర్ పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్లి సర్వీసు రికార్డు, హాజరుపట్టికను పరిశీలించారు.
:-ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.