కే.వై.సీ పేరిట కుచ్చు టోపీ..! ఖాతా నుండి 9.50లక్షలు ఖాళీ


♦ నూతన సాంకేతిక పరిఙ్ఞానాన్ని పోలీసులు ఉపయోగిస్తున్నపటికీ…సైబర్​ నేరస్థులు వివిధ పద్ధతుల్లో ప్రజల్ని బురిడీ కొట్టిస్తూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు.
కే.వై.సీ పేరుతో ఓ వ్యక్తిని నమ్మించి రూ.9.50 లక్షలు మాయం చేసిన సంఘటన హైదరాబాద్​లో చోటు చేసుకుంది.

♦ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తార్మాకలో నివసించే సుబ్బారాయుడుకు మీ పేటీఎం కేవైసీ అప్​డేట్ చేసుకోవాలని.. అందుకు క్విక్ సపోర్ట్ యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలని ఫోన్​లో ఆగంతుకుడు చెప్పాడు.

♦ నిజమే కావచ్చు అని నమ్మిన సుబ్బారాయుడు వెంటనే క్విక్ సపోర్ట్ యాప్ డౌన్​లోడ్ చేసుకొని, ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకపోయినా అతను చెప్పినట్లుగా నడుచుకున్నాడు.

♦ మొదట మీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయని ఆగంతకుడు అడిగాడు. రెండు కార్డులని చెప్పాడు. ఒక కార్డుతో ఒక రూపాయి ఎవరికైనా పంపించాలని సూచించగా..సుబ్బారాయుడు చేశాడు. ఇది పని చేయడం లేదనుకుంటా.. మరో కార్డుతో చేయండని సైబర్ మోసగాడు సూచించాడు. అతను చెప్పినట్లు సుబ్బారాయుడు చేశాడు అంతే.

♦ తన బ్యాంకు ఖాతా నుంచి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు డ్రా అయిపోయాయి.

♦ కొద్ది సేపటికి తేరుకున్న సుబ్బారాయుడు మోస పోయానని గ్రహించాడు.
వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

About The Author