కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ సారి బోనాలు నిర్వహించడం లేదు…


కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ సారి బోనాలు నిర్వహించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌‌ర‌‌ణ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 25  నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కోండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, 19న హైదరాబాద్ బోనాలు ఉండవని పేర్కొన్నారు. ఆయా గుడుల పూజారులే అమ్మ వార్లకు బోనాలు సమర్పిస్తారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని అరణ్యభవన్‌‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆలయాలు తెరవడానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్‌‌ఓ‌‌పీ)పై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి గుడుల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలని, సోడియం హైపోక్లోరైడ్‌‌తో గుడి ఆవరణ కడగాలని, ఎంట్రీలోనే శానిటైజర్స్‌‌ అందుబాటులో ఉంచాల‌‌ని, థర్మల్‌‌ స్క్రీనింగ్‌‌కు ఏర్పాట్లు చేయాలని అధికారుల‌‌ను ఆదేశించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం గుడులు ఓపెన్‌‌ కావని చెప్పారు.

About The Author