రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: రానున్న రెండు, మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని  వాతావరణ శాఖ తెలిపింది..శనివారం  ఉపరితల ఆవర్తనం  ప్రభావంతో శనివారంకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.. అరకభద్ర (ఇచ్ఛాపురం)లో 7, పెందుర్తిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం లో అల్పపీడనం ఏర్పడిన తరువాత కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరగనున్నాయి. రానున్న రెండ్రోజుల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి.

ఈనెల 9, 10 తేదీల్లో విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..

శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. ఉండిలో 43.38, మక్కువలో 43.23, చీమకుర్తిలో 43.17 ఉష్ణోగ్రత నమోదైంది…

About The Author