రాష్ట్రంలో మరో డాక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు…


చిత్తూరు: రాష్ట్రంలో మరో డాక్టర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. పెనుమూరు ప్రాథమిక కేంద్రం డాక్టర్ అనితారాణిని సస్పెన్షన్‌ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వైద్య ఆరోగ్యశాఖపై అసత్య  ప్రచారం చేశారంటూ అనితారాణిని అధికారులు సస్పెండ్ చేశారు. డాక్టర్‌ అనితారాణి మానసిక స్థితి సరిగా లేదని డీఎంఅండ్ హెచ్‌వో పెంచలయ్య చెబుతున్నారు. ఇప్పటివరకు పనిచేసిన ప్రాంతాల్లో తన తీరుతో వివాదాస్పదమయ్యారని, ఇప్పటికే పలుమార్లు డాక్టర్‌ అనితారాణి సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. అనితారాణి ఆరోపణలు అవాస్తవమని పెంచలయ్య కొట్టిపారేశారు.
వైసీపీ నేతలు తనపై దాడి చేశారని పోలీసులకు డాక్టర్ అనితారాణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనితారాణి పెనుమూరు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు, వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో డాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. పెనుమూరు ఆస్పత్రిలో అన్యాయలను అడ్డుకున్నందుకు వైసీపీ నేతలతో కలిసి కొంతమంది సిబ్బంది తనపై కుట్ర చేశారని వాపోయారు. మార్చి 22న ఆస్పత్రిలో తనను వైసీపీ నేతలు బంధించారని, తనను డిప్యూటీ సీఎం నారాయణస్వామి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కక్షతోనే చిత్తూరుకు డిప్యూటేషన్‌పై పంపారని, 2నెలలు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనితారాణి వాపోయారు.
డాక్టర్‌ అనితారాణి వ్యవహారంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు. నిజానిజాలేంటో తేల్చాలని సీఐడీ అధికారులను ఆదేశించారు. అయితే అనితారాణి వ్యవహారంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత ఆమె సస్పెన్షన్‌ వేటు వేయటం ఏమిటని
పలువురు ప్రశ్నిస్తున్నారు.

About The Author