బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవ స్థానం, తాడిపత్రి…
బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవ స్థానం, తాడిపత్రి
బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన ఆలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువున్నాడు.
అందమైన శిల్ప కళా నిలయం జిల్లా కేంద్రం అనంతపురం కు 57 కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా ఉన్నది తాడిపత్రి.
ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడి చేత ప్రతిష్టిం బడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు. క్రీ .శ 1495 ప్రాంతంలో గుత్తి – గండికోట పాలకుడుగా ఉన్న విజయనగర సేనాని రేచెర్ల రామలింగ నాయుడు (కొన్ని సంఘటనల అనతరం ) నీటి బుగ్గలున్న ప్రాంతం లో ఉన్న శివలింగాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించాడు. నీటి బుగ్గ ఉన్న ప్రాంతం లో ఉండటం చేతశివుణ్ణి బుగ్గ రామలింగేశ్వరుడు పిలువటం వాడుక అయినది. ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురియై ప్రభావాన్ని కోల్పోగా 1800 సం. రం లో ఈ ప్రాంత కలెక్టర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో ఆలయ పునఃరుద్దరణ, పూజాదికాలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.
ఇది పెన్నా నది పడమటి తీరం లో ఉన్నది. ఆలయానికి శిధిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి. శిధిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగం లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలి వెళ్ళేప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురం లో బాగం గానే వినాయకుడికి చిన్నపాటి మందిరం ఉంటుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణం లో శివాలయం తో పాటు మరో రెండు దేవాలయాలు కోదండ రామ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారం తో ఉంటె, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగిఉన్నది. వీరబద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది.
తాడిపత్రి కి చేరటానికి మార్గాలు
———————————
చెన్నై-రేణిగుంట -గుత్తి రైలు మార్గం లో తాడిపత్రి రైల్వే స్టేషన్ ఉన్నది దేశం లో చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు రైలు ప్రయాణ సౌకర్యమున్నది. దగ్గరలో ఉన్న అనంతపురం, కడప ల నుండి రాష్ట్ర ప్రభుత్వ bus ల ద్వారా లేదా taxi ల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.