కృష్ణా జిల్లాలో వింత.. రెండు తలలతో దూడ జననం

విజయవాడ: కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో వింత ఘటన చోటు చేసుకుంది. రెడ్డి గూడెం మండలం రుద్రవరం గ్రామంలో  రెండు తలలతో దూడ జన్మించింది. గరికపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిలోని గేదె రెండు తలలు ఉన్న దూడకుజన్మనిచ్చింది. దూడకు రెండు తలలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవింతదూడనుచూసేందుకు గ్రామప్రజలుతండోపతండాలుగాతరలివస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు చాలా జరిగాయి. అయితే గతంలో జన్మించిన దూడలు జన్మించిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. కానీ ఈ ఘటనలో మాత్రం తల్లి ఆవుతో పాటు రెండు తలల లేగదూడ కూడా సురక్షితంగా ఉండడం విశేషమనే చెప్పాలి

About The Author